టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది.
ఈ సినిమాపై అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పుష్ప 2 మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా కీలకపాత్రల్లో పహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, అనసూయ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయి సంచలన విజయం అందుకున్న పుష్ప 1 మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప 2 తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకోవటం ఖాయమని మేకర్స్ అంటున్నారు. ముఖ్యంగా
అన్నిచోట్ల ఈ మూవీకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్ కూడా లభిస్తుందని ఇటీవల వారు ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేశారు.
మూవీ కంటెంట్ పై తమందరికీ ఎంతో నమ్మకం ఉందని ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఈ మూవీ విజయం ఖాయం అని వారు తెలిపారు. విషయం ఏమిటంటే మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని నవంబర్ రెండవ వారంలో రిలీజ్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ మూవీ యొక్క ట్రైలర్ నవంబర్ 15న పక్కాగా రిలీజ్ అవుతుందని దీనికి సంబంధించి మేకర్స్ నుంచి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. మరి అందరిలో ఎంతో భారీ క్రేజ్ ఏర్పరిచిన పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అనుకుంటుందో చూడాలి