టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ఇక ఈమూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ పాన్ ఇండియన్ యాక్షన్ మాస్ మూవీలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఫహద్ ఫాసిల్, రావు రమేష్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. విషయం ఏమిటంటే పుష్ప 2 మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ యొక్క బిజినెస్ ఏరియా వైజ్ ఎంత మేర జరిగిందో పూర్తి డీటెయిల్స్ క్రింద ఇవ్వబడ్డాయి.
- నైజాం: రూ. 80 కోట్లు
- సీడెడ్: రూ. 30 కోట్లు
- ఉతరాంధ్ర: రూ. 23.40 కోట్లు
- ఈస్ట్: రూ. 14.40 కోట్లు
- వెస్ట్: రూ. 10.80 కోట్లు
- గుంటూరు: రూ. 15.30 కోట్లు
- కృష్ణా: రూ. 12.60 కోట్లు
- నెల్లూరు: రూ. 7.2 కోట్లు
మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 194 కోట్ల బిజినెస్ జరుపుకోగా, ఈ మూవీ బ్రేకివెన్ చేరుకోవాలి అంటే రూ. 200 కోట్లమేర రాబట్టాలి. అయితే గతంలో ఇంత బిజినెస్ ని అధిగమించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్, బాహుబలి మాత్రమే నిలిచాయి. మరి పుష్ప 2 ఎంతమేర వాటిని దాటుతుందో చూడాలి.