టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై దీనిని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి.
జగపతి బాబు, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఇటీవల పుష్ప నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తాజాగా 150 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
కాగా తెలుగు వర్షన్ మైత్రి మూవీ వారి యూట్యూబ్ హ్యాండిల్ లో 119 మిలియన్ వ్యూస్ తో పాటు ఇతర ఛానల్స్, హ్యాండిల్స్ లో 31 మిలియన్ ని అందుకున్నాయి. మొత్తంగా ఇది టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టీజర్ గా సంచలనం సృష్టించింది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన పుష్ప 2 ది రూల్ మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.