స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తొలి రోజు మిక్స్డ్ టాక్/రివ్యూస్ వచ్చినా కలెక్షన్ లు సూపర్ హిట్ రేంజ్ లో సాధించి అల్లు అర్జున్ స్టామినా ఎంటో తెలియజేసింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో బాహుబలి 1 ను క్రాస్ చేసి ట్రేడ్ పండిట్ల చెత్త ఔరా అనిపించుకుంది.
ఇక ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల అవుతుంది అని అక్కడక్కడా పుకార్లు వినిపించినా అధికారికంగా యే రిలీజ్ డేట్ ఇవ్వబడలేదు.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2 మొదలవడం మరింత ఆలస్యం కానుందని తెలిసింది.
దీనికి కారణం దర్శకుడు సుకుమార్ అనారోగ్యం. మొదటి భాగం షూటింగ్ సమయంలో కూడా సుకుమార్ కు స్వల్ప అస్వస్థత తో ఉండటంతో కొన్ని రోజులు షూటింగ్ నిలిపివేశారు.ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే పుష్ప 2 ఆగస్ట్ లో స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అయితే స్క్రిప్టు వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో పాటు సుకుమార్ ఆరోగ్యం కాస్త కుదుట పడే వరకు సినిమా మొదలయ్యే సూచనలు ఏవీ కనిపించట్లేదు.
ముందుగా సుకుమార్ కోలుకుని , స్క్రిప్టు వర్క్ క్షుణ్ణంగా జరిపిన తరువాతే సినిమా పట్టాలెక్కెందుకు ఒప్పుకుంటారు అని చెప్తున్నారు.సినిమాకి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు కాబట్టి కాస్త ఆలస్యంగా అయినా సరే పుష్ప మళ్ళీ తగ్గేదెలే అంటూ అలరించడం ఖాయం.
పుష్ప సినిమాలో పాటలు ఎలా ఫేమస్ అయ్యాయి అనేది తెలిసిన విషయమే, పాటలతో పాటు తగ్గేదేలే డైలాగ్ అల్లు అర్జున్ మానరీజమ్ కూడా బాగా వైరల్ అయి సినిమాకి ఎనలేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది.ఇక పార్ట్ 2 లో ఫాహద్ ఫాజీల్ కి అద్భుతమైన పాత్ర ఉంటుంది అని, పుష్ప కి షేఖావత్ కీ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుంది అని భోగట్టా. వీటితో పాటు పుష్ప 2లో ఇంకెన్ని విశేషాలు ఉన్నాయో తెలియాలి అంటే కాస్త ఓపిక పట్టక తప్పదు.