Homeసినిమా వార్తలుPushpa 2 sets Big Benchmark in Book My Show బుక్ మై షోలో...

Pushpa 2 sets Big Benchmark in Book My Show బుక్ మై షోలో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ‘పుష్ప – 2’

- Advertisement -

పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 అందరిలో మొదటి నుంచి ఎన్నో అంచనాలు ఏర్పరిచి మొన్న గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ టాక్ అయితే సొంతం చేసుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించారు.

ఇక ఫస్ట్ డే రూ. 280 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ బుక్ మై షో లో అదిరిపోయేటువంటి రికార్డులు అయితే నెలకొల్పుతోంది. ఇప్పటికే మొత్తంగా ఆ యాప్ లో పుష్ప 2 మూవీకి 6 మిలియన్ టికెట్స్ బుక్ అయి రికార్డు అందుకుంది. అలానే ఒక గంటలో ఒక లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయిన మూవీగా ఇండియా వైడ్ సెన్సేషన్ సృష్టించిన పుష్ప 2.

ఇక ఏకంగా 1,17,000 టికెట్ల అమ్మకాలు జరుపుకుంది. ఈ విషయాన్ని బుక్ మై షో యొక్క సి ఈ ఓ ఆశిష్ సక్సేనా తెల్పుతూ ఇది అల్లు అర్జున్ పుష్ప 2 యొక్క ప్రభంజనం అని అన్నారు. గతంలో ఈ రికార్డుని బాహుబలి 2 మరియు ఆర్ఆర్ఆర్ మాత్రమే కలిగి ఉన్నాయి. మొత్తంగా పుష్ప 2 రాబోయే రోజుల్లో మరింత పెద్ద బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు

READ  Pushpa 2 Hindi: Baahubali 2 Record in Danger 'పుష్ప - 2' హిందీ : డేంజర్ లో బాహుబలి 2 రికార్డు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories