Home సినిమా వార్తలు Pushpa 2 Release Trailer Date Locked ‘పుష్ప – 2’ రిలీజ్ ట్రైలర్ డేట్...

Pushpa 2 Release Trailer Date Locked ‘పుష్ప – 2’ రిలీజ్ ట్రైలర్ డేట్ లాక్

pushpa 2 movie

పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, ధనుంజయ, అనసూయ, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన థియేటర్ ట్రైలర్ సాంగ్స్ తో అందరిని ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి డిసెంబర్ 2న అనగా రేపు హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేయనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప 2 కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ పలు ప్రాంతాల్లో ఓపెన్ అవ్వగా వాటికి భారి స్థాయిలో రెస్పాన్స్ అయితే లభిస్తుంది.

ముఖ్యంగా అల్లు అర్జున్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో పాటు సుకుమార్ అత్యద్భుతమైన టేకింగ్ ఈ సినిమాకి భారీ విజయవందీస్తుందని టీమ్ అభిప్రాయపడుతున్నారు. మరి డిసెంబర్ 5న గ్రాండ్ గా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న పుష్ప 2 రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version