ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అనసూయ, సునీల్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే దీని నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచి మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న పుష్ప 2 మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వాస్తవానికి ఆగష్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ డిసెంబర్ 6కి ఇటీవల టీమ్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం పక్కాగా పుష్ప 2 మూవీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లు చెప్తున్నారు.
దానికి కారణం రష్మిక మందన్న, విక్కీ కౌశల్ నటిస్తున్న బాలీవుడ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ చావా ని అదే రోజున రిలీజ్ చేస్తున్నట్లు నేడు ఆ మూవీ మేకర్స్ అనౌన్స్ చేయడమే అంటున్నారు. నిజానికి అదే రోజున బ్రహ్మానందం ప్రధాన పాత్ర చేస్తున్న బ్రహ్మా ఆనందం మూవీ కూడా అదే రోజున రిలీజ్ అంటూ కూడా ప్రకటన వచ్చింది. మరి పుష్ప 2 మేకర్స్ పక్కాగా రిలీజ్ డేట్ పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.