టాలీవుడ్ స్టార్ నటుడు పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసాయి. అయితే విషయం ఏమిటంటే, నవంబర్ 2వ వారం నుండి డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ వరకు ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించి వరుసగా అప్ డేట్స్ ని అందించేందుకు సిద్దమవుతున్నారట మేకర్స్.
తప్పకుండా పార్ట్ 1 మించేలా పుష్ప పార్ట్ 2 మరింత అద్భుతంగా అందరినీ ఆకట్టుకుంటుందని మూవీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫహద్ ఫాసిల్, అనసూయ, రావు రమేష్, సునీల్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్న పుష్ప 2 మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.