ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మించిన తాజా సినిమా పుష్ప 2. ఇటీవల డిసెంబర్ 5న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే నుండి మంచి టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం అన్ని వర్గాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ బాగానే కలెక్షన్ తో కొనసాగుతుంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయి కలెక్షన్ అందుకోని ఈ సినిమా అటు నార్త్ లో మాత్రం అదరగొడుతుంది. మరోవైపు తమిళనాడులో తాజాగా పుష్ప 2 మూవీ ఒక పెద్ద రికార్డును అయితే నెలకొల్పింది. ఇప్పటికే అక్కడ బాహుబలి 2 మూవీ నెలకొల్పిన రూ. 150 కోట్ల గ్రాస్ ని పుష్ప 2 బీట్ చేసే అవకాశం లేనప్పటికీ తాజాగా అక్కడ రూ. 50 కోట్ల గ్రాస్ ని అందుకుంది పుష్ప 2.
ఈ విధంగా తమిళనాడులో ఫస్ట్ నాన్ రాజమౌళి సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది పుష్ప 2. బాహుబలి 2 తో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రమే అక్కడ రూ. 50 కోట్లు అందుకున్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పుష్ప 2 కి తమిళనాడులో పెద్దగా కాంపిటీషన్ ఇచ్చే సినిమాలు లేకపోవడంతో మొత్తంగా ఈ సినిమా ఓవరాల్ గా అక్కడ ఎంతమేర రాబడుతుందో చూడాలి మరి.