Home సినిమా వార్తలు Pushpa 2 movie Climax BGM Devisri or Sam CS పుష్ప – 2...

Pushpa 2 movie Climax BGM Devisri or Sam CS పుష్ప – 2 క్లైమాక్స్ బిజీఎం దేవిశ్రీనా లేకా సామ్ సిఎస్ ?

devi sri prasad

లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడిగా నటించిన ఈ భారీ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

అయితే ఈ మూవీ యొక్క బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ ని రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో పాటు తమన్, అజనీష్ లోకనాథ్ మరియు సామ్ సిఎస్ కలిసి చేస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. మరోవైపు తమన్ కూడా పుష్ప 2 కి పని చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక సామ్ సిఎస్ కూడా ఈ మూవీకి వర్క్ చేస్తుండగా తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల పుష్ప ఈవెంట్లో భాగంగా మూవీ యొక్క క్లైమాక్స్ సన్నివేశాలకి డిఎస్పి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని సుకుమార్ చెప్పారు.

మరోవైపు తాజాగా తాను పెట్టిన ట్విట్టర్ పోస్టులో ఈ మూవీ యొక్క ఫైట్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ కి అదిరిపోయే బీజీఎమ్ వర్క్ అందచేసానని ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు సామ్ సిఎస్. దీన్ని బట్టి మరి ఇంతకీ పుష్ప 2 మూవీ క్లైమాక్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్షన్ ని డిసిఎస్పి ది ఫిక్స్ చేసారా లేక సామ్ దా అనేదానిపై మాత్రం క్లారిటీ రావాల్సింది. మొత్తంగా అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version