పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. ఇక చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూట్ కొన్నాళ్ల పాటు అగయిపోయిందని, ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ ల మధ్య విబేధాలు తలెత్తాయని రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రూమర్స్ పై తాజాగా మేకర్స్ స్పందించారు.
అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని, జులై 25 నుండి పుష్ప 2 తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుండగా 27 నుండి అల్లు అర్జున్ షూట్ లో పాల్గొంటారని, మరోవైపు మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ తో పాటు మరోవైపు ఇతర వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అలానే ఎట్టి పటిస్థితుల్లో పుష్ప 2 మూవీ ని డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకి తీసుకువస్తాం అని వారు తెలిపారు.