పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందున్న హీరోయిన్ గా సుకుమార్ తీస్తున్న పుష్ప 2 మూవీ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని అంచనాలు అమాంతంగా పెంచేసాయి.
డిసెంబర్ 5న పుష్ప 2 మూవీ గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీలో ఫహాద్ ఫాసిల్, అనసూయ, రావు రమేష్, జగపతి బాబు, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కి తెలుగు తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది, మరీ ముఖ్యంగా మల్లు అర్జున్ గా కేరళ ఆడియన్స్ అయనని ఎంతో ఇష్టపడుతుంటారు. విషయం ఏమిటంటే పుష్ప 2 మూవీని కేరళలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు అక్కడి డిస్ట్రిబ్యూటర్. అలానే ఇప్పటివరకు అక్కడ టాప్ ఓపెనింగ్స్ స్థానంలో ఉన్న విజయ్ లియో మూవీ హైయెస్ట్ అయిన రూ. 12 కోట్లని బద్దలుకొట్టాలనేది తమ టార్గెట్ అన్నారు.
అయితే ప్రస్తుతం కేరళలో పుష్ప 2 కి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా వాటికి బాగానే రెస్సాన్స్ వస్తున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాదిరిగా లియో ఓపెనింగ్ రికార్డ్స్ ని బద్దలుకొట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అదీకాక రెండు డిజిట్స్ సంఖ్యని కూడా అది చేరుకునే ఛాన్స్ లేదు. అయితే ఓపెనింగ్స్ పరంగా పుష్ప 2 మూవీ ఇప్పటికే అక్కడ రెండవ స్థానంలో ఉన్న కెజిఎఫ్ 2 (రూ. 7.25 కోట్ల) ని మాత్రం బ్రేక్ చేసే ఛాన్స్ కనపడుతోంది. మరి మొత్తంగా డిసెంబర్ 5న రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.