పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 మరొక రెండు రోజుల్లో గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కించగా కీలకపాత్రల్లో పహాద్ ఫాజిల్, జగపతిబాబు, అనసూయ, సునీల్, రావు రమేష్ నటించారు. అందరిలో భారీ క్రేజ్ కలిగిన ఈ సినిమా అన్ని వర్గాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
మరోవైపు తాజాగా పుష్ప 2 కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని చోట్ల నుంచి కూడా మంచి క్రేజ్ అయితే లభిస్తోంది. ఇక విషయం ఏమిటంటే అటు నార్త్ లో ముఖ్యంగా హిందీ బెల్టు లో పుష్ప 2 ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయి. గతంలో బాహుబలి 2 మూవీ 6.5 లక్షల ఫుట్ ఫాల్స్ ని నేషనల్ చైన్స్ లో కలిగి ఉంది. నిజానికి ఈ ఫీట్ ని ఏ ఇతర సినిమా కూడా అందుకోలేకపోయింది. ఆ తర్వాత జవాన్ 5.5 లక్షలు, కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 5.2 లక్షలు గా ఉన్నాయి.
ఇక తాజా పరిస్థితిని బట్టి చూస్తే పుష్ప 2 ఇప్పటికే 1 లక్షకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ ని నేషనల్ చైన్స్ లో సంపాదించింది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ లు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ఫైనల్ గా 7 లక్షలకి చేరి బాహుబలి రికార్డు ని బద్దలుకొట్టి నార్త్ బెల్ట్ లో టాప్ స్థానంలో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా పుష్ప 2 మూవీ భారీ క్రేజ్ కలిగి ఉండటంతో మంచి టాక్ కనక లభిస్తే ఓవరాల్ గా భారీ స్థాయిలో అత్యద్భుత విజయాన్ని అందుకుని చాలా ఏరియాల్లో గత రికార్డులను బద్దలు కొట్టే అవకాశం అయితే కనపడుతుంది.