టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్, రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ పై భారత దేశంలోని మూవీ లవర్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్స్ తో పాటు రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక పుష్ప 2 కి సంబంధించి మొత్తంగా రానున్న రోజుల్లో ఇండియాలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ ని గ్రాండ్ లెవెల్లో నిర్వచించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక వీడియో బైట్ ద్వారా తెలిపారు.
హైదరాబాద్, పాట్నా, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా, కొచ్చి లలో ఈ ఈవెంట్స్ జరుగనున్నాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్న పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో ఆడియన్స్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మెప్పించి విజయం అందుకుంటుందో చూడాలి.