ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా రూ. 1670 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ అతి పెద్ద ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ ని అలానే మార్కెట్ వేల్యూ ని అమాంతంగా పెంచేసింది. ఇక ఈ మూవీ ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఏడు భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది.
అయితే మొదటి రెండు వారాలు మాత్రం నెట్ ఫ్లిక్స్ లో పుష్ప 2 భారీ స్థాయి వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఇండియా తో పాటు ఇతర దేశాల్లో కూడా నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో కొనసాగింది ఈ మూవీ. మొత్తంగా రెండు వారాల్లో 9.4 మిలియన్ మంది వ్యూయర్స్ దీనిని వీక్షించగా 35.6 మిలియన్స్ గంటల వ్యూస్ లభించాయి. తద్వారా ఈ మూవీ మొదటి రెండు వారాలు అత్యధికులు వీక్షించిన సౌత్ ఇండియన్ మూవీగా రికార్డు కూడా అందుకుంది.
అయితే తాజాగా ఈమూవీ ఒక్కసారిగా వ్యూయర్ షిప్ తగ్గి వెనక్కు వెళ్ళింది. దానికి కారణంగా లేటెస్ట్ గా నిత్యా మీనన్, జయం కలిసి నటించిన కాదలిక నేరమిల్ల మూవీ ఐదు పాన్ ఇండియన్ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటూ ఉండడమే. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో కొనసాగుతోంది. ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూర్చిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని కిరుతిగ ఉదయనిధి తెరకెక్కించారు.