ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 మొత్తంగా భారి స్థాయిలో అత్యధిక థియేటర్లో డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ మూవీలో మరొక్కసారి పుష్పరాజ్ గా అల్లు అర్జున్ తన అద్భుత పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఈ మూవీ చాలా ప్రాంతాల్లో ఓపెనింగ్స్ పరంగా బాహుబలి 2 రికార్డ్స్ అయితే బద్దలు కొట్టింది.
ఇండియాలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బాహుబలిని మించి ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు అయితే వచ్చాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం బాహుబలి 2 రికార్డులు ఈ సినిమా అందుకోలేకపోయింది. బాహుబలి 2 మొత్తం 10 మిలియన్ డాలర్లకు పైగా ఓపెనింగ్ ని అక్కడ సంపాదించగా పుష్ప 2 మాత్రం 8 మిలియన్ డాలర్ల వద్ద మాత్రమే ఆగింది.
ఇక వరల్డ్ వైడ్ ఓపెనింగ్ పరంగా పుష్ప 2 సినిమా రూ. 280 కోట్లకు గ్రాస్ సొంతం చేసుకుని ఆల్ టైం ఇండియా అత్యధిక గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాగా భారీ సెన్సేషనల్ రికార్డును నమోదు చేసింది. మరి ఓవరాల్ గా పుష్ప 2 మూవీ ఎంత మేర రాబడుతుందో ఏ స్థాయిలో పెర్ఫామ్ చేస్తుందో తెలియాలంటే మరి కొన్నాళ్ల వరకు ఆగక తప్పదు