Homeసినిమా వార్తలుPushpa 2 English Version also Available in OTT 'పుష్ప - 2' ఓటిటిలో ఇంగ్లీష్...

Pushpa 2 English Version also Available in OTT ‘పుష్ప – 2’ ఓటిటిలో ఇంగ్లీష్ లో కూడా

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద మొత్తంగా వరల్డ్ వైడ్ రూ.1670 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో నిర్మించారు.

బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా తాజాగా ఓటీటీలో కూడా గ్రాండ్ లెవెల్ లో రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది ఈ మూవీ. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియన్ భాషల్లో ఆకట్టుకుంటుండగా తాజాగా దీనిని బెంగాలీతో పాటు ఇంగ్లీషులో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

మొత్తంగా ఏడు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న పుష్ప 2 కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తుంది. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఇంగ్లీష్ వర్షన్ లో ప్రసారమై అందరినీ ఆకట్టుకుంది. మరి పుష్ప 2 మూవీ ఇంగ్లీష్ వర్షన్ ఎంతమేరా గ్లోబల్ ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  Vidaamuyarchi 2 days Worldwide Boxoffice Collections '​విడాముయార్చి' 2 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories