ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న తాజా భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా కీలకపాత్రల్లో ఫహాద్ ఫాసిల్, జగపతిబాబు, అజయ్, అనసూయ, సునీల్ వంటి వారు నటిస్తున్నారు.
ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలన్నీ కూడా అందర్నీ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇకపోతే విషయం ఏమిటంటే నేడు ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక పుష్పటు మూవీకి సెన్సార్ వారు యూ / ఏ సర్టిఫికెట్ అందించారు.
ఈ మూవీకి మూడు మ్యూట్ వర్డ్స్ పడినట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు గంటల పది నిమిషాల పాటు సాగనుంది పుష్ప 2. అయితే రన్ టైం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా తమ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంటుందని నిర్మాతలు మరియు ఇతర టీం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5న అందరి ముందుకు రానున్న పుష్ప2 ఏ స్థాయి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి