Homeసినిమా వార్తలుPushpa 2 Beats Kanguva Movie Openings In Tamil Nadu తమిళనాడులో కంగువ మూవీ...

Pushpa 2 Beats Kanguva Movie Openings In Tamil Nadu తమిళనాడులో కంగువ మూవీ ఓపెనింగ్స్‌ను బీట్ చేసిన పుష్ప 2

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచి మొత్తంగా డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ముందు రోజు డిసెంబర్ 4న 9:30 కి ఈ మూవీ యొక్క ప్రీమియర్ షోలు పలు ప్రాంతాల్లో ప్రదర్శించగా దానికి సక్సెస్ టాక్ లభించింది. అల్లు అర్జున్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలిచింది.

సుకుమార్ ఆశించిన మెప్పించే స్క్రీన్ ప్లే రాసుకోనప్పటికీ కూడా అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మంచి ప్రయోజన అయితే తెచ్చిపెట్టింది. ఇక అసలు విషయం ఏమిటంటే పుష్ప 2 మూవీ చాలా ఏరియాలో మంచి ఓపెనింగ్స్ అయితే రాబట్టింది. ముఖ్యంగా తమిళనాడులో అది సూర్య కంగువాను బీట్ చేసింది. అలానే తమిళనాడు స్టేట్ రికార్డుగా హైయెస్ట్ ఓపెనింగ్స్ పరంగా నిలిచిన బాహుబలి 2 రికార్డుని అది దాటేసింది.

ఇక ఓపెనింగ్స్ పరంగా పుష్ప 2 మూవీ కోలీవుడ్ లో అత్యధిక స్థాయి కలెక్షన్ అందుకోవడంతో అక్కడ ఓవరాల్ గా బాగానే కలెక్షన్ రాబట్టే అటువంటి అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. మరోవైపు ఈ మూవీ ఓవరాల్ గా తమిళనాడులో రూ. 100 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని గతంలో ఈ ఫీట్ ని కేజిఎఫ్ చాప్టర్ 2 అలానే బాహుబలి మాత్రమే అందుకున్నాయి. మరి పుష్ప 2 ఎంతమేరా ఈ రేర్ ఫీట్ ని అధిగమించి ఎంతమేర కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

READ  Kantara a Legend Release Date Fix 'కాంతారా ఏ లెజెండ్' రిలీజ్ డేట్ ఫిక్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories