Home సినిమా వార్తలు Pushpa 2: 300 Cr Opening Guaranteed పుష్ప 2 : 300 కోట్ల ఓపెనింగ్...

Pushpa 2: 300 Cr Opening Guaranteed పుష్ప 2 : 300 కోట్ల ఓపెనింగ్ పక్కా

allu arjun pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా భారీ స్థాయిలో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లో ఆరు భాషల్లో రిలీజ్ కి సిద్ధమైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవిశంకర్, నవీన్ ఎర్నేని దీనిని గ్రాండ్ లెవెల్ లో నిర్మించారు.

ఇక ఈ సినిమా డే 1 ఓపెనింగ్ పరంగా చూస్తుంటే రూ. 300 కోట్ల వరకు గ్రాస్ ని అయితే అందుకునే అవకాశం కనబడుతోంది. ఇక ఈ సినిమా హిందీ వర్షన్ లో  ట్రేడ్ అనలిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం రూ. 70 కోట్ల గ్రాస్ తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో రూ. 120 కోట్ల గ్రాస్, సదరన్ స్టేట్స్ లో రూ. 35 కోట్లు మొత్తం రూ. 220 కోట్లు నుంచి రూ. 250 కోట్ల వరకు అది చేరే అవకాశం కనపడుతుంది. అటు ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా రూ. 80 కోట్ల వరకు కూడా రాబట్టే అవకాశం ఉంది.

మొత్తంగా దీనిబట్టి చూస్తే ఓవరాల్ గా డే 1 ఓపెనింగ్ పుష్ప 2 మూవీ పక్కాగా రూ. 300 కోట్లు చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే గనక జరిగితే అత్యధిక టాప్ డే 1 రికార్డు అందుకున్న ఇండియన్ మూవీగా పుష్ప 2 సంచలనం నమోదు చేయడం ఖాయం. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version