టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా పేరు గాంచిన పూరి జగన్నాథ్ తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కొన్నేళ్ల క్రితం రూపొందిన బద్రి మూవీ ద్వారా మెగా ఫోన్ పట్టారు. అక్కడి నుండి పలు సక్సెస్ లతో కొనసాగిన పూరికి సూపర్ స్టార్ మహేష్ తో తీసిన పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి గొప్ప పేరు తీసుకువచ్చింది.
అక్కడి నుండి మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లిన పూరి ఇటీవల మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ లు లేక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇటీవల ఆయన తీసిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలుస్తూ వస్తున్నాయి.
అప్పట్లో ఛార్మితో ఆయన తీసిన జ్యోతి లక్ష్మి ఫ్లాప్ కాగా, ఆ తరువాత కళ్యాణ్ రామ్ ఇజం, రోగ్, బాలకృష్ణ పైసా వసూల్, మెహబూబా కూడా ఫ్లాప్ అయ్యాయి. ఆపైన రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ మాత్రం హిట్ కొట్టింది. ఆ తరువాత విజయ్ దేవరకొండ తో తీసిన లైగర్, తాజాగా రామ్ తో తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
అయితే అంతకముందు ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ తో హిట్ కొట్టారు పూరి, కానీ ఆ మూవీ కథ వక్కంతం వంశీ రాసినది. ఇక ఇటీవల తన సొంత కథతో ఒక్క హిట్ అందుకున్నారు పూరి. అది కూడా ఇస్మార్ట్ శంకర్ మాత్రమే, ఇక మిగతవన్నీ డిజాస్టర్స్. కాగా ఆ మూవీ కూడా రామ్ స్టైల్, డ్యాన్స్, సాంగ్స్ వల్లనే ఆడింది.
దీనిని బట్టి ఆయన నుండి ఎలాంటి కాలం చెల్లిన కథలు వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇస్మార్ట్ శంకర్ కూడా పెద్ద గొప్ప కథ కాదు. అందుకే ఇక పూరి కథ రాసేబదులు ఎవరి వద్ద నుండి అయినా రాసిన కథతో సినిమా చేస్తే టెంపర్ లాగా పాజిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. మొత్తంగా కెరీర్ పరంగా అన్నీ డిజాస్టర్స్ చవి చూసిన పూరి జగన్నాథ్ ఇకపైనా అయినా మంచి సక్సెస్ లతో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.