Homeసినిమా వార్తలుహ్యాట్రిక్ కొట్టనున్న పూరి -విజయ్ దేవరకొండ

హ్యాట్రిక్ కొట్టనున్న పూరి -విజయ్ దేవరకొండ

- Advertisement -

“లైగ‌ర్” సినిమాతో పూరి – విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల జోడీ కుదిరింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలున్నాయి. ఆ సినిమా షూటింగ్ లో వుండగానే “జ‌న‌గ‌ణ‌మ‌న‌” అనే మరో సినిమా చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు. 2023 ఆగస్టులో ఆ సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు.

ఒకప్పుడు ఇలా హీరో- దర్శకుడు కలిసి వరుసగా సినిమాలు చేసేవాళ్ళు. ఆ తరువాత కూడా అలాంటి సాంప్రదాయం కొనసాగినా,ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే అదే హీరోతో మరో సినిమా అనౌన్స్ చేసిన పూరి ఒక కొత్త సంప్రదాయానికి తెర లేపారు అనే చెప్పాలి.

అయితే ఇప్పుడు త‌మ రికార్డుని తామే బ‌ద్దలు కొట్టుకుంటూ,ముచ్చ‌ట‌గా మూడో సినిమా కూడా చేసేయ‌బోతున్నారు. అవును,జ‌న‌గ‌ణ‌మ‌న‌ పూర్త‌యిన వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూరి మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. జ‌న‌గ‌ణ‌మ‌న‌ చివ‌రి ద‌శ‌లో ఈ కొత్త సినిమాని అధికారికంగా ప్ర‌క‌టించబోతున్నార‌ని సమాచారం.

పూరి మూడో సినిమాకి సంబంధించిన‌చ క‌థ కూడా ఆల్రెడీ సిద్ధం చేసేశారని, జన‌గ‌ణ‌మ‌న‌ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గానే,ఈ సినిమా గురించి ప్ర‌క‌టించి, ప‌ట్టాలెక్కించేస్తార‌ని తెలుస్తోంది. జ‌న‌గ‌ణ‌మ‌న‌సినిమా షూటింగ్ దశలో ఉండగానే విజయ్ దేవరకొండ “ఖుషీ” సినిమా మొదలు పెట్టారు.

మహానటి సినిమాలో కలిసి నటించిన విజయ్‌ దేవరకొండ, సమంత  మళ్లీ “ఖుషీ”లో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు. ఈసారి మరింత రొమాంటిక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందుకు తగ్గట్లే సినిమాకు “ఖుషి” అని టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. నిన్నుకోరి, మజిలీ, టక్‌ జగదీష్‌ లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే కశ్మీర్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్‌ను ఖరారు చేసిన మూవీ మేకర్స్‌ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతల ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

READ  మెగాస్టార్ VS రెబల్ స్టార్

గతంలో పవన్‌ కల్యాణ్‌, భూమిక కాంబినేషన్‌లో “ఖుషి”అనే సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో విజయ్‌ దేవరకొండ, సమంత వస్తున్నారు. దీంతో “ఖుషీ” తో పవర్‌స్టార్‌ లాగే ఈ విజయ్ దేవరకొండ కూడా బ్లాక్ బస్టర్‌ హిట్‌ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అలాగే పూరితో మూడో సినిమా చేస్తున్న‌ప్పుడే, మ‌రో సినిమా కూడా స‌మాంత‌రంగా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారట‌. మొత్తానికి ఒకే హీరో తో వ‌రుస‌గా మూడు సినిమాలు చేసిన ఘ‌న‌త మూట‌గ‌ట్టుకొన్నాడు పూరి. మ‌ళ్లీ ఇలాంటి మ్యాజిక్ చూడ‌లేమేమో కదా.?

Follow on Google News Follow on Whatsapp

READ  మరో హిట్ కు నాంది పలికిన అల్లరి నరేష్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories