తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎక్సయిటింగ్ డైరెక్టర్-యాక్టర్ కాంబినేషన్స్ లో పూరీ జగన్నాథ్, బాలకృష్ణల కాంబో ఒకటని చెప్పవచ్చు. గతంలో వీరిద్దరి కలయికలో భారీ అంచనాల మధ్య విడుదలైన పైసా వసూల్ సినిమాలో తేడా సింగ్ పాత్రలో బాలకృష్ణ మంచి వినోదాన్ని అందిస్తారని అందరూ భావించారు. అయితే ఈ సినిమా హైప్ కి తగ్గట్టుగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
ఇప్పుడు పూరీ జగన్నాథ్, బాలకృష్ణ కాంబో రిపీట్ చేయడానికి సిద్ధం అవుతున్నారని భోగట్టా. ఓ వైపు బ్యాక్ 2 బ్యాక్ హిట్స్ తో టాప్ ఫామ్ లో ఉన్న బాలకృష్ణ ఉంటే మరో పక్క లైగర్ వంటి ఘోర పరాజయం తర్వాత పూరి జగన్నాథ్ కాస్త నిరాశాజనకమైన దశలో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు తాజా సమాచారం.
ప్రస్తుతం అనిల్ రావిపూడితో కలిసి పని చేస్తున్న బాలకృష్ణ , ఆ సినిమా పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ సినిమాను ప్రారంభిస్తారు. ఇక అనిల్ రావిపూడి, బాలకృష్ణ ప్రాజెక్ట్ విషయానికి వస్తే బాలయ్య తన సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని, బాలయ్యను పూర్తిగా కొత్త కోణంలో కొత్త పాత్రలో చూపిస్తానని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అనిల్ రావిపూడి అంటేనే ఎంటర్టైన్మెంట్ కి పెట్టింది పేరు. కానీ బాలకృష్ణతో ఆయన తీసే సినిమా మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉంటుంది.
బాలయ్య స్టయిల్ కి తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా ఉండబోతోంది. అనిల్ రావిపూడి ఈ సినిమా ద్వారా కమర్షియల్ ఎలిమెంట్స్ ని హైలైట్ చేసి తన బెస్ట్ ని బయటకు తీసుకురావడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.