Homeసినిమా వార్తలుడిస్ట్రిబ్యూటర్ల పై కేసు నమోదు చేసిన పూరి జగన్నాథ్

డిస్ట్రిబ్యూటర్ల పై కేసు నమోదు చేసిన పూరి జగన్నాథ్

- Advertisement -

దర్శకుడు పూరి జగన్నాథ్ తన జీవితంలోనే ఏ సినిమాకీ వెచ్చించని సమయాన్ని లైగర్ చిత్రంపై వెచ్చించారు. రెండు సంవత్సరాలకు పైగానే ఈ సినిమాకి పనిచేశారు, కాగా ఈ చిత్రంలో యువతరం ప్రేక్షకులు రౌడీ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించారు.

పూరి, విజయ్ దేవరకొండ మరియు లైగర్ బృందం ఈ చిత్రం గురించి అతిశయోక్తి గల ప్రకటనలు ఇవ్వడం ద్వారా సినిమాను చాలా దూకుడుగా ప్రమోట్ చేసారు, అందువల్ల బయ్యర్లు మరియు ప్రేక్షకులలో ఈ సినిమా పై ఆసక్తి బాగా కలిగింది.

ఆగస్టులో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ను ఏదో రకంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

లైగర్ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వాటిల్లాయి. మరియు నివేదికల ప్రకారం పూరి కూడా నష్టపరిహారానికి అంగీకరించారని వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం తన బాధ్యత అని పూరి భావించారు.

ఇక అదే కోవలో.. పూరి తన బకాయిలన్నీ క్లియర్ చేశారని చెప్పబడింది, అయితే పూరికి మరియు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుకు మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది, పూరి ఇంకా తనకి బాకీ చెల్లించనందున వరంగల్ శ్రీను పూరి పై దాడి చేసి బెదిరించేలా చాలా మంది సబ్ డిస్ట్రిబ్యూటర్లను ప్రోత్సహిస్తున్నారని కూడా వినిపిస్తోంది.

READ  సర్దార్ సీక్వెల్ ను రెడీ చేస్తున్న కార్తీ

ఇటీవల ఇదే విషయంలో, పూరీ జగన్నాథ్ యొక్క ఫోన్ కాల్ లీక్ అయి వైరల్ అయ్యింది, ఇందులో పూరీ తన కార్యాలయం వద్ద ధర్నా చేయాలనుకున్న పంపిణీదారుల పై చాలా తీవ్రంగా స్పందించారు. దానికి ప్రతిగా పూరీ మోసగాడు అని డిస్ట్రిబ్యూటర్లు ఆరోపిస్తున్నారు మరియు వారి ప్రకారం, పూరి వాగ్దానం చేసిన డబ్బు ఇవ్వలేదని సమాచారం.

తన కుటుంబం పై హింసకు బెదిరింపులకు పాల్పడినందుకు మరియు వారికి ఇంకా డబ్బు బాకీ ఉందని తప్పుగా ఆరోపించినందుకు పూరి ఇప్పుడు వరంగల్ శ్రీను మరియు జి శోబన్ బాబుల పై పోలీసులకి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పూరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరియు ఇద్దరి పై తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం తను ముంబైలో నివసిస్తున్నందున.. హైదరాబాద్ ఇంట్లో నివసిస్తున్న తన అత్తగారు, భార్య , మరియు తన కుమార్తెలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలని పోలీసులను అభ్యర్థించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ABN, Mahaa, TV5 ఛానెల్‌ల పై బాయ్కాట్ ట్రెండ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories