మోలీవుడ్ లో ప్రస్తుతం నటుడిగా అటు దర్శకుడిగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇటీవల పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సలార్ మూవీ ద్వారా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక SSMB 29 మూవీలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు.
ఆ విధంగా నటుడిగా అన్ని భాషల ఆడియన్స్ లో కూడా ఆయనకు బాగా పేరుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెండు సార్లు యువ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ని కలిసి కథలు విన్నానని, అయితే కొన్ని కారణాల రీత్యా అవి చేయాలకేపోయానని అన్నారు.
ప్రత్యేకంగా తనకు లోకేష్ టేకింగ్ అంటే ఇష్టం అని, ఆ క్యారెక్టర్స్ మిస్ అయినందకు తాను చింతిస్తున్నట్లు తెలిపారు పృథ్వీరాజ్. రాబోయే రోజుల్లో లోకేష్ తో ఒక సినిమా చేసే అవకాశం వస్తే మాత్రమే ఎట్టిపరిస్థితుల్లో మిస్ చేసుకోబోనని అన్నారు.
ఇక తాజాగా మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎల్ 2 ఎంపురాన్ మూవీ మార్చి 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. మలయాళంతో పాటు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా ఆ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.