Homeసినిమా వార్తలుసాాలార్ లో నటించనున్న పృథ్వీరాజ్

సాాలార్ లో నటించనున్న పృథ్వీరాజ్

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ “సాలార్” మీద భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’ వంటి భారీ పాన్ ఇండియా సీరీస్ రూపొందించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకక్కిస్తుండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.చాలా రోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్‌ సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. ఈ మొదటి షెడ్యూల్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ కూడా షూట్ చేశారని తెలిసింది. తరువాత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్‌లో ప్రభాస్‌ మీద కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారు.

ఇక ‘సాలార్’లో ప్రభాస్‌తో పాటు మరికొందరు హీరోలు కూడా నటించబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కేజీఫ్ నుండి రాకీ భాయ్ ఈ సినిమాలో కనిపిస్తాడని,అలాగే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కూడా సాలార్ తో లింక్ అయి ఉంటుంది అని వార్తలు వచ్చాయి.అయితే అవేవీ అధికారికంగా ధృవీకరించబడలేదు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని కూడాగతంలో ప్రచారం జరిగింది. ఈ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని పృథ్వీరాజ్ స్వయంగా వెల్లడించాడు.పృథ్వీరాజ్ సుకుమారన్‌ హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా ‘కడువా’ అనే సినిమా జూన్ 30న విడుదల కానుంది.

ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా ప్లాన్ చేసింది. సౌత్‌లోని నాలుగు సిటీల‌లో ప్ర‌మోష‌న్లు చేయ‌డానికి బృందం ప‌య‌న‌మై, ఇప్ప‌టికే బెంగ‌ళూర్‌లో ప్రెస్‌మీట్ నిర్వ‌హించగా, శ‌నివారం హైద‌రాబాద్‌లో అవాస హోట‌ల్‌లో కూడా ప్రెస్ ను కలిసింది. అయితే బెంగళూరు ప్రెస్ మీట్లో ‘సలార్’ మూవీలో నటిస్తున్నానని వెల్లడించారు. రెండేళ్ల క్రితం తనకు ప్రశాంత్ నీల్ తనకు స్క్రిప్ట్ నెరెట్ చేశాడని, ఆ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని,తనకు నచ్చినా కూడా ఆ సమయంలో తాను చాలా బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోయాను అని పృథ్విరాజ్ చెప్పారు. అయితే ఇప్పటికీ తను సాలార్ టీమ్ తో కాంటాక్ట్ లో ఉన్నానని,ఖచ్చితంగా ఈసారి డేట్స్ అడ్జస్ట్ చేసి సినిమాలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఆయన తెలిపారు.

READ  లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి

ఇక హైదరాబాద్లో ప్రశాంత్ నీల్ ను ఆయన కలవనున్నారని, డేట్స్ మీద ఒక క్లారిటీ ఈ మీటింగ్లో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సాలార్ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories