Home సినిమా వార్తలు Manoj – Vishnu: మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఆస్తి వివాదాలు?

Manoj – Vishnu: మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఆస్తి వివాదాలు?

మంచు విష్ణు మరియు అతని తమ్ముడు మనోజ్‌ల గొడవ నిన్నటి నుండి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్‌గా మారింది, ఈ సోదరులు తమ వ్యక్తిగత సమస్యను వీధిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ గొడవకు సంభందించిన వార్తలు వేగంగా వ్యాపించాయి. ఈ గొడవకు సంబంధించిన వీడియోను మనోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. అయితే ఆ వీడియో ఆ తర్వాత ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అయితే ఈ మొత్తం వ్యవహారం పై మంచు విష్ణు స్పందిస్తూ, ఈ సంఘటన చాలా చిన్నవిషయమని మరియు ఇది తమ కుటుంబానికి సంభందించిన విషయమని, దానిని ఇతరులు తీవ్రమైన సమస్యగా పరిగణించకూడదని అన్నారు. అయితే, తన స్నేహితుడు సారధితో గొడవ ఆపుకోలేని సందర్భంలో సోదరుడు మనోజ్ ఆగ్రహానికి గురయ్యాడని విష్ణు పేర్కొన్నారు.

ఇండస్ట్రీ వర్గాల కథనాల ప్రకారం విష్ణు, మనోజ్‌ల మధ్య విభేదాలు చాలా కాలంగా ఉన్నాయని, తాజాగా మరో స్థాయికి వెళ్లాయని అంటున్నారు. మంచు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తుల వాటా విషయం ఏ గొడవలు రావడానికి ప్రధాన కారణమని అంటున్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు చాలా సాధారణం మరియు ఈ ఇద్దరు హీరోల మధ్య కూడా అలాంటి సమస్య వచ్చి ఉండవచ్చు.

మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మనోజ్ మరియు మౌనిక ప్రతిష్టాత్మక స్థాయిలో రాజకీయ మరియు వ్యాపార ప్రణాళికలను కలిగి ఉన్నట్లు సమాచారం. వీరి సోదరి లక్ష్మీ ప్రసన్న ఈ గిసవలో మనోజ్‌ను పూర్తిగా వెనకేసుకొచ్చారని అంటున్నారు. కాగా వీరు ముగ్గురూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version