Homeసినిమా వార్తలుProject K: ప్రభాస్ ఫ్యాన్స్ ను.. ప్రేక్షకులను నిరాశపరచిన ప్రాజెక్ట్ కే చిత్ర బృందం

Project K: ప్రభాస్ ఫ్యాన్స్ ను.. ప్రేక్షకులను నిరాశపరచిన ప్రాజెక్ట్ కే చిత్ర బృందం

- Advertisement -

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దీపికా పదుకొనె ప్రధాన పాత్రలలో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ కే. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంభందించి అప్డేట్ ల కోసం ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు మరియు ఇది భారీ పాన్ ఇండియన్ చిత్రం కాబట్టి, ప్రతి అప్‌డేట్ ఈ సినిమాకి చాలా అవసరం. ప్రాజెక్ట్ కే టీమ్ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈరోజు ఒక సర్ప్రైజ్ వీడియో అప్‌డేట్ ఇచ్చింది, అయితే ఈ అప్‌డేట్ ప్రభాస్ అభిమానులను మరియు ప్రేక్షకులలో కొన్ని వర్గాల వారిని నిరాశపరిచింది.

https://twitter.com/VyjayanthiFilms/status/1609059147055521793?t=Bc4PPxIj7tfnwqoMYrTTeA&s=19

హీరో లేకుండా సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించి ఏ విధమైన లింక్ లేనప్పుడు ఇలాంటి వీడియోలను విడుదల చేయడానికి కారణం ఏంటని ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రతిదానికి సరైన సమయం ఉందని నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్న వ్యక్తులు అర్థం చేసుకోవాలి.

READ  Pawan Kalyan: బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ 2’లో 3 పెళ్లిళ్ల పై మాట్లాడిన పవన్ కళ్యాణ్

ప్రాజెక్ట్ కే అనేది రెగ్యులర్ యాక్షన్ సినిమా కాదు, సినిమా ఎలా తీయాలి, ఎలా తీయబోతున్నారు అనే విషయాల పై స్పష్టత వచ్చే స్థితికి రావడానికి కూడా చాలా సమయం పడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే చెప్పారు. కాబట్టి టీమ్ ప్లాన్ ప్రకారం అప్ డేట్స్ వస్తాయి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగా రావడం కుదరదు.

కేవలం ప్రాజెక్ట్ కే సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే పైన పేర్కొన్న విధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మరియు అతని బృందానికి చాలా సమయం పట్టింది. దర్శకుడు తన సైన్స్-ఫిక్షన్ చిత్రం కోసం ఆటోమొబైల్స్‌ను అభివృద్ధి చేసేందుకు గానూ మహీంద్రా గ్రూప్ సహాయం పొందారు.

గతంలో అమితాబ్ బచ్చన్ మరియు ప్రభాస్‌ల ప్రీ-లుక్ పోస్టర్‌లను వారి పుట్టినరోజుల సందర్భంగా విడుదల చేసిన మేకర్స్, ఈ రోజు సినిమా ప్రీ-ప్రొడక్షన్‌లలో ఒక ఎపిసోడ్‌తో ముందుకు వచ్చారు.

వీల్‌ రీ-ఇన్వెంటింగ్ అనే టైటిల్ తో విడుదలైన ఈ ఎపిసోడ్ లో నాగ్ అశ్విన్‌ను ఆర్ట్ మరియు ఆటోమొబైల్ నిపుణుల సహాయంతో కావలసిన చక్రాన్ని డిజైన్ చేసి తయారు చేయించడం మనం చూడవచ్చు.

READ  రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సీక్వెల్ కన్ఫర్మ్

కాగా వీడియో చివరలో మనం చూసేది కస్టమ్-మేడ్ వాహనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన చక్రం. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోనె హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories