తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదురుకుంటుంది.నిజానికి ఇతర చిత్ర పరిశ్రమ లతో పోలిస్తే మన తెలుగు సినీ పరిశ్రమ తొందరగా కోలుకుని పనులు ప్రారంభించింది అన్నది నిజం. అయితే సక్సెస్ రేట్ మాత్రం పెరగటం లేదు. ఇప్పటికీ పది శాతం సక్సెస్ రేట్ ఉంటే గొప్పగా చెప్పుకునే పరిస్తితి. అంటే సుందరానికి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది కానీ ప్రేక్షకులు థియేటర్ ల వైపు కదలలేదు. అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా బాగుందని అంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవు.F3 వంటి సీక్వెల్ క్రేజ్ ఉన్న సినిమా కూడా తొలి మూడు రోజుల తరువాత కలెక్షన్ లు తగ్గుతూ పోయాయి.తాజాగా విడుదలైన విరాటపర్వం సినిమా కూడా బాగుందన్నారు కానీ ఆ సినిమాకివచ్చిన మొదటి రోజు వసూళ్లు కనీస స్థాయిలో కూడా రాకపోవడం విచిత్రం.
థియేటర్లలో కనిపిస్తున్న ఈ అవస్థను అందరూ నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనాఉంది.ఒక వైపు టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ, ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం లేదనే విషయాన్ని అర్థం చేసుకుని అందుకు తగిన నిర్ణయాలు కానీ ప్రణాళికలు కానీ అమలు చేయాలి.
అందుకే ఇప్పుడు నిర్మాతలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా సినిమాలు పరాజయం చవి చూశాయి ఈ సంవత్సరంలో, కొన్ని సినిమాలు ఓటిటి డీల్స్ వల్ల నష్టాన్ని కాస్త భర్తీ చేయగలిగాయి.అందుకే ఇక మీదట హీరోలకు ఇచ్చే రేమ్యునరేషన్ తగ్గించాలి అని,ముఖ్యంగా చిన్న హీరోలకు వాళ్ళ స్థాయిని మించిన అమౌంట్ ఇవ్వకూడదు అని నిర్ణయించినట్టు సమాచారం.
నిజానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ విపరీత పోకడకు ఓ విధంగా పరిశ్రమే కారణం అని చెప్పవచ్చుకరోనా మరియు లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని చెప్తూ పెద్ద సినిమాల కోసం రేట్లు విపరీతంగాపెంచుకున్నారు. తీరా పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ అయి చిన్న సినిమాలు లేదా మీడియం బడ్జెట్ సినిమాలు వచ్చే సమయానికి ఎడ తెరిపి లేకుండా సినిమాలు చూసాము అన్న భావన ప్రేక్షకులకు కలిగి థియేటర్ ల వైపు రావటం మానేశారు. కేవలం టికెట్ రేట్లు తగ్గిస్తే మాత్రమే చాలదని,ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది అన్న విషయం గమనించాలి.ఇప్పుడు ఒక సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటే తప్ప ఓపెనింగ్స్ ఆ పైన లాంగ్ రన్ ఉండటం లేదు.