కెరీర్ తొలిరోజుల నుండీ ఎప్పటికప్పుడు కొత్తదనం తో కూడుకున్న కథలు,సినిమాలు చేయడం అలవాటు చేసుకున్న నటుడు నాని. కేవలం కథలని ఎంపిక చేసుకోవడం కాదు ఆ కథల్లో, పాత్రల్లో ఒదిగిపోయి మెప్పించడం కూడా తనకే చెల్లింది.
అలా అంచలంచలు ఎదిగి నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని, తొందరలోనే స్టార్ హీరో అయ్యే రూట్ లో ఉన్నాడు అనుకునేలోగా పరిస్థితులు తారుమారు అయ్యాయి.ఆకట్టుకునే స్క్రిప్ట్ లను ఎంచుకున్నా, మాస్ ఆడియన్స్ ను ధియేటర్ లకు రప్పించడం విఫలం అవుతున్నాడు నాని.దానికి ఉదాహరణ “శ్యామ్ సింఘా రాయ్” సినిమా, అద్భుతమైన కధ ఉన్నా అంచనాలు అందుకోలేక పోయింది.
ఇప్పుడు అంటే సుందరానికీ చిత్రానికి ఓపెనింగ్స్ పరవాలేదు అనిపించగా, రోజు రోజుకీ కలెక్షన్స్ తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఈ విషయం నాని తదుపరి చిత్రం “దసరా” నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తుంది. తమ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుండడంతో వలన టెన్షన్ లో ఉన్నారు.
బాక్స్ ఆఫీస్ వద్ద నాని బాడ్ ఫేజ్ కారణంగా తమ సినిమాని ఎక్కువ అమౌంట్ కు బిజినెస్ చేయకూడదు అని నిర్మాతలు భావిస్తున్నారు ఏదేమైనా తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించే నటుల్లో నాని ఒకడు. ప్రస్తుతానికి అతను గడ్డుకాలం ఎదురుకున్నా ఖచ్చితంగా తిరిగి తన విమర్శకులను మెప్పిస్తాడు అని ఆశిద్దాం.