Home సినిమా వార్తలు ఆ రెండు మూవీస్ ఫెయిల్యూర్స్  నుండి నిర్మాతలు నేర్చుకోవాల్సిన విషయాలు 

ఆ రెండు మూవీస్ ఫెయిల్యూర్స్  నుండి నిర్మాతలు నేర్చుకోవాల్సిన విషయాలు 

game changer hari hara veera mallu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా గేమ్ చేంజర్. ఇటీవల సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.

ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పాన్ ఇండియన్ స్థాయిలో గ్రాండ్ లెవెల్ లో ఏం రత్నం నిర్మించిన తాజా హిస్టారికల్ యాక్షన్ సినిమా హరిహర వీరమల్లు. ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

నిజానికి ఈ రెండు సినిమాలు కూడా భారీ డిజాస్టర్స్ తో మెగా ఫాన్స్ ఎంతో ఢీలా పడ్డారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు కూడా భారీ స్థాయి బడ్జెట్ తో రూపొందాయి. అయితే మధ్యలో పలుమార్లు వీటి షూటింగ్స్ కూడా బ్రేక్ పడి చాలా ఆలస్యం అవటం కూడా ఈ మూవీస్ కొంత నెగిటివ్ టాక్ కారణం అంటున్నారు విశ్లేషకులు. ఈ రెండు సినిమాలు కూడా రూ. 100 కోట్లకు పైగా నష్టాలను నిర్మాతలకు తెచ్చిపెట్టాయి.

అటు పవన్ కళ్యాణ్, ఇటు రామ్ చరణ్ ఇద్దరూ కూడా తమ తమ సినిమాల్లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచినప్పటికీ కథాకథనాలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోవడంతో వీటి భారీ పరాజయాలకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. నిజానికి ఎంత భారీ స్థాయిలో నిర్మించిన సినిమా అయినప్పటికీ బలమైన కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే పరాజయం తప్పదు అనటానికి ఈ రెండు సినిమాలే ప్రధాన కారణమని ఈ విషయాన్ని నిర్మాతలు తెలుసుకోవాలని కోరుతున్నారు ఆడియన్స్, సినీ విశ్లేషకులు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version