Homeసినిమా వార్తలుKGF3: కేజీఎఫ్ 3, కేజీఎఫ్ ఫ్రాంచైజీ గురించి నిర్మాత షాకింగ్ అప్డేట్

KGF3: కేజీఎఫ్ 3, కేజీఎఫ్ ఫ్రాంచైజీ గురించి నిర్మాత షాకింగ్ అప్డేట్

- Advertisement -

‘కేజీఎఫ్’ భారీ విజయంతో సహజంగానే ప్రేక్షకులలో తదుపరి చిత్రం ‘కేజీఎఫ్ 3’ గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ప్రశాంత్ నీల్ మరియు నిర్మాత విజయ్ కిరగందూర్ ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే పలుమార్లు హింట్స్ ఇచ్చారు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సాలార్’ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా, హోంబలే ఫిల్మ్స్ కూడా దక్షిణ భారత పరిశ్రమలలో ఆసక్తికరమైన చిత్రాల శ్రేణిని కలిగి ఉంది. కాబట్టి కెజిఎఫ్ ౩ సినిమా ఇప్పుడు అప్పుడే మొదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక హీరో యష్ కూడా కేజీఎఫ్ ౩ ఖచ్చితంగా ఉంటుందని చెప్పినప్పటికీ, ఇది తను చేయబోయే తదుపరి చిత్రం కాదని వెల్లడించారు. దాంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు.

అయితే కేజీఎఫ్ ౩ గురించి యష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇప్పటికే తాను, ప్రశాంత్ మధ్య చాలా సీన్స్ గురించి ఆలోచన జరిగినట్లు ఆయన తెలిపారు. కేజీఎఫ్ 2 లో మేం చేయలేక పోయినవి చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని తదుపరి భాగంలో తీసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని మాకు తెలుసు, చాలా అద్భుతమైన సన్నివేశాలు కూడా మా మదిలో ఉన్నాయి. కానీ ఇవి కేవలం ఇంకా ఆలోచన స్థాయిలో మాత్రమే ఉన్నాయి. కాగా ప్రస్తుతానికి వాటిని అక్కడే వదిలివేశాము” అని రాకింగ్ స్టార్ ఇంతకు ముందు ఒక సందర్భంలో తెలిపి ఈ ప్రాజెక్టుకు భారీ హైప్ ను జోడించారు.

READ  Aamir Khan: ఎన్టీఆర్ సినిమాలో ఆమిర్ ఖాన్ నటిస్తారనేది ఇండస్ట్రీలో హాట్ బజ్

కేజీఎఫ్ 3 2025లో మొదలవుతుందని, అంతకు ముందు మాత్రం అది సాధ్యం అయ్యే అవకాశం లేదని నిర్మాత విజయ్ కిరగందూర్ వెల్లడించారు. కాగా కేజీఎఫ్ 5 వరకు ఫ్రాంచైజీని తీసుకు వెళ్ళే ప్రణాళికలు ఉన్నాయని ఆయన అన్నారు. రాకీ భాయ్ గా యష్ స్థానంలో ఇతర నటులు నటించే అవకాశాలు ఉన్నాయని నిర్మాత ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నారు.

కాగా ఈ కేజీఎఫ్ ఫ్రాంచైజీ జేమ్స్ బాండ్ సిరీస్ మాదిరిగా ఉంటుందని, ఆ ప్రఖ్యాత హాలీవుడ్ సీరీస్ లో లాగే ఈ కేజీఎఫ్ ఫ్రాంచైజీలో కూడా వివిధ నటులు కనిపిస్తారని విజయ్ కిరగందూర్ అన్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  2022 Recap: 2022 సంవత్సరం టాలీవుడ్ టాప్ హీరోల బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ మరియు ర్యాంకింగ్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories