Homeసినిమా వార్తలుదీపికా పదుకునే ఆరోగ్యం బాగానే ఉందంటున్న నిర్మాతలు

దీపికా పదుకునే ఆరోగ్యం బాగానే ఉందంటున్న నిర్మాతలు

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు మహనటి లాంటి క్లాసిక్ తీసిన నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకునే నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం మీద అభిమానులతో పాటు ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి సీరీస్ తరువాత సరైన హిట్ లేకపోవడం వల్ల ప్రభాస్ అభిమానులు కూడా ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందా అని వేయి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా యొక్క తాజా షెడ్యూల్ ఈరోజే ప్రారంభం అవ్వాల్సి ఉండగా, గత కొన్ని రోజులుగా దీపిక స్వల్ప అనారోగ్యం తో బాధ పడుతుందన్న వార్తలు రావడంతో సినిమాకి సంబంధించిన అన్ని వర్గాల వారూ కాస్త ఆందోళన చెందారు.

అయితే దీపిక ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదనీ,మూడు రోజుల క్రితం కేవలం రెగ్యులర్ చెకప్ మాత్రమే చేయించుకుంది అని, ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఈరోజు షూటింగ్ లో పాల్గొంది అని నిర్మాతలు తెలిపారు.దీపిక నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ప్రాజెక్ట్ కే అవటం మరో విశేషం.

తొలి చిత్రంతోనే షారుక్ ఖాన్ లాంటి పెద్ద హీరోతో ఛాన్స్ దక్కించుకున్న దీపికా, ఆ తరువాత వరుస విజయాలతో అటు నటిగా చక్కటి పేరుతో పాటు స్టార్ స్టేటస్ కూడా దక్కించుకుంది. కెరీర్ లో అక్కడక్కడా కాస్త వివాదం రేపిన సంఘటనలు ఉన్నప్పటికీ తనకి అభిమానులలో ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగి ప్రాజెక్ట్ కే తొందరలోనే మన ముందుకు రావాలి అనీ, దీపికా పదుకునే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆశిద్దాం.

READ  కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమా పబ్లిసిటీ

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories