Homeసినిమా వార్తలుOTT రిలీజ్ కు మొగ్గు చూపుతున్న చిన్న సినిమాల నిర్మాతలు

OTT రిలీజ్ కు మొగ్గు చూపుతున్న చిన్న సినిమాల నిర్మాతలు

- Advertisement -

కరోనా పాండమిక్ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ అనేవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కొన్ని నెలల పాటు థియేటర్లు మూతబడి ఉండటంతో.. నిర్మాతలు నష్టాల నుంచి బయట పడటానికి ఓటీటీలను ఆశ్రయించారు. ఓటీటీలు సైతం భారీ ఆఫర్లు ఇచ్చి చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలు ఓటీటీ లోనే వీక్షించే అవకాశం ప్రేక్షకులకు ఇచ్చాయి.

ఈ క్రమంలో పెద్ద చిత్రాలను కూడా నాలుగు వారాలకే ఓటీటీ రిలీజ్ అవడం మొదలు పెట్టారు.డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీలు భారీ ధరలు చెల్లిస్తుండటంతో.. నిర్మాతలు కూడా సంతోషంగా ఆ డీల్స్ చేసుకుంటూ లాభసాటి వ్యాపారం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. అయితే ఓటీటీల వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని నిర్మాతలు గుర్తించలేకపోయారని ఒక వాదన ఆలస్యంగా తెర పైకి వచ్చింది.

డిజిటల్ వేదికల హవా పెరగడంతో శాటిలైట్ రైట్స్ రేట్లు పడిపోవడమే కాదు.. మొత్తం థియేటర్ వ్యవస్థపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది అనే మాటలో నిజం లేకపోలేదు. ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాలు కనీసం ఆరు వారాలు లేదా యాభై రోజులకు గానీ ఓటీటీలోకి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా మూడు వారాలకే డిజిటల్ వేదికల మీదకు వస్తున్నాయి. దీంతో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. ఎలాగూ కొన్ని రోజులు పోతే సినిమాలు ఓటీటీలో వస్తున్నాయి కదా అన్న ఆలోచనతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు.

READ  భారీ డిజాస్టర్ గా నిలిచిన అంటే సుందరానికీ

ఇలా సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గిపోతుండటంతో తెలుగు నిర్మాతల మండలి ఇటీవలే కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. పెద్ద సినిమాలు ఎనిమిది వారాల తరువాతే ఓటీటీ లో విడుదల కావాలని అలాగే చిన్న సినిమాలు అయితే ఆరు వారాల తరువాత విడుదల చేయాలని నిర్ణయించారు.ఆ నిర్ణయం పట్ల ఒక వర్గం నిర్మాతలు అసంతృప్తి తో ఉన్నారు అని తెలియ వచ్చింది.

సినిమా ఫ్లాప్ అయినప్పుడు తొందరగా ఓటీటీలో విడుదల చేసుకునే వెసులుబాటు దూరం అయినందున ఆదాయం వచ్చే అవకాశం పోయిందన్న ఆలోచనలో సదరు నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే కొత్త నిభందనలు వర్టించకుండా నేరుగా ఓటీటీ లోనే తమ సినిమాలు విడుదల చేయాలని నిర్ణయించారట.

Follow on Google News Follow on Whatsapp

READ  అంటే సుందరానికీ OTT రిలీజ్ కి కుదిరిన ముహూర్తం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories