Homeసినిమా వార్తలుపోస్ట్ పోన్ రూమర్లని ఖండించిన ప్రభాస్ ఆది పురుష్ నిర్మాతలు

పోస్ట్ పోన్ రూమర్లని ఖండించిన ప్రభాస్ ఆది పురుష్ నిర్మాతలు

- Advertisement -

హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుందని నిర్మాతలు ధృవీకరించారు. ఈ సినిమా 2024కి వాయిదా పడుతుందని, ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సాలార్ సినిమా ఆదిపురుష్ కంటే ముందే రిలీజ్ అవుతుందని ఇటీవలే వార్తలు వచ్చాయి.

ఈ రకమైన రూమర్‌లకు స్వస్తి పలుకుతూ చిత్ర నిర్మాతలు విడుదల తేదీని జూన్ 16, 2023 అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సినిమా టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో, విజువల్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి మేకర్స్ మరి కొంత సమయం తీసుకుంటున్నారు. దీంతో ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా విడుదలను సంక్రాంతి సీజన్ నుంచి మరో తేదీకి వాయిదా వేశారు.

యానిమేట్రానిక్స్ వంటి ఫిల్మ్ మేకింగ్‌లో అధునాతన సాంకేతికతను ఈ సినిమా కోసం ఉపయోగించారు మరియు ఆ అవుట్‌పుట్ లో నాణ్యత లోపించిందని విమర్శించారు. అయితే ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పష్టం చేశారు.

READ  జపాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి 2 మిలియన్ మార్కు దాటిన RRR

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందని అటు ప్రభాస్ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల వారు కూడా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి ఇండియా మొత్తం మీద కూడా భారీ క్రేజ్ ఉంది అందుకే అన్ని విధాలగా సరిపోయే రిలీజ్ డేట్ సెలెక్ట్ చేస్తున్నారు.

2024కి వాయిదా వేస్తే ఖచ్చితంగా సినిమా క్రేజ్ తగ్గుతుంది. అందువల్ల, ఆదిపురుష్ చిత్ర నిర్మాతలు తీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పవచ్చు. యూనివర్సల్ అప్పీల్‌తో తెరకెక్కే ఈ తరహా సినిమాలకు జూన్ విడుదల తేదీ సరైన సమయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  ప్రభాస్ ఆదిపురుష్ సంక్రాంతికే వస్తుందా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories