Homeసినిమా వార్తలుగాడ్ ఫాదర్ సినిమా వాయిదా పుకార్ల పై వివరణ ఇచ్చిన నిర్మాతలు

గాడ్ ఫాదర్ సినిమా వాయిదా పుకార్ల పై వివరణ ఇచ్చిన నిర్మాతలు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ”గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా ముగిసింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కావడం లేదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా వరకు మిగిలి ఉన్నాయని.. అందుకే సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నారని అంటున్నారు. అలాగే సినిమాకు సంభందించిన రీ-రికార్డింగ్ పనులు కూడా ఇంకా మిగిలి ఉన్నాయని.. అందుకు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ తగిన సమయం కేటాయించట్లేదని, దాని వల్ల కూడా సినిమా పనులు ఆలస్యం అవుతున్నాయని కూడా పేర్కొన్నారు. ఇలా రకరకాల పనుల్లో జాప్యం వలన గాడ్ ఫాదర్ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చని.. అందుకే ఈ సినిమా క్రిస్మస్ సీజన్ కు వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడానికి చిత్ర బృందం దిగి వచ్చారు. సడెన్ గా పుట్టుకొచ్చిన పుకార్లని కొట్టి పారేశారు. అధికారికంగా చెప్పిన తేదీనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ”ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. త్వరలోనే ప్రమోషన్స్ ను ప్రారంభిస్తున్నాం” అని నిర్మాత ఎన్వి ప్రసాద్ తెలిపారు.

READ  పక్కా కమర్షియల్ OTT రిలీజ్ డేట్ ఖరారు

అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. ఇంకా సినిమాకి సంభందించిన ప్రచార కార్యక్రమాలను ఇంకా మొదలు పెట్టలేదు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి దూకుడుగా ప్రమోషన్స్ చేసేందుకు పెద్దగా ఇష్టపడరు. ఐతే అవన్నీ పాత పద్ధతులని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాకు పబ్లిసిటీ అనేది చాలా అవసరం అని పలువురు సినీ వర్గాల వారు అంటున్నారు. అలానే మెగా అభిమానులు కూడా సినిమాకి సంభందించిన అప్డేట్స్ సరిగా రావట్లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పుకార్లు పుట్టుకు రావడం అభిమానులని మరింత భయాందోళనకు గురి చేసింది. అయితే ఇప్పుడు స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ నుండే స్పష్టత రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇక మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథి పాత్రలో కనిపించనున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

READ  Box-Office: కార్తీకేయ-2 16 డేస్ కలెక్షన్స్

కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్బి చౌదరి మరియు ఎన్వి ప్రసాద్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ నుంచి రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాధించాలని అభిమానులు ఆశతో ఉన్నారు. మరి వారి ఆశలు నిజమవ్వాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories