తాజాగా టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా అందాల కథానాయక సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్తు నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
రిలీజ్ అనంతరం ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న తండేల్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. కాగా తమ మూవీ ఇప్పటికే వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ని క్రాస్ చేసిందని ఇటీవల నిర్మాత బన్నీ వాసు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. మొదట్లో తాము చెప్పిన విధంగానే నాగచైతన్యకు భారీ విజయం అందించామని ఇంతటి విజయాన్ని అందించిన ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేశారు బన్నీ వాసు.
అయితే ట్రేడ్ అనలిస్టుల ఒరిజినల్ లెక్కల ప్రకారం ఈ మూవీ ఇంకా రూ. 85 కోట్ల గ్రాస్ మార్కు వద్దే ఉంది. అతి త్వరలో ఈ సినిమా రూ. 100 కోట్లు అందుకునే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఓవరాల్ గా తండేల్ ఎంత మేరు రాబడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి.