టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఒక భారీ పాన్ ఇండియన్ మాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మలయాళ నటుడు టోవినో థామస్ ఒక కీలక పాత్ర చేస్తుండగా కన్నడ అందాల నటి రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ పై అందరిలో ఎన్నో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం అయింది.
ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అయిన డ్రాగన్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయంతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.
ఆ సందర్భంగా జరిగిన సక్సె మీట్ లో భాగంగా మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్, నీల్ ల సినిమా యాక్షన్ తో కూడినదని, అలానే అది కూడా డ్రాగన్ అని టైటిల్ అనౌన్స్ చేసారు. అలాగని తమిళ్ సినిమా డ్రాగన్ ని తక్కువ చెయ్యాలని కాదు.
అయితే వారిద్దరి క్రేజీ కాంబో సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది, దానిని ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేసే ప్లాన్ ఉందన్నారు. కాగా తమిళ్ సినిమా డ్రాగన్ హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది, తదుపరి రానున్న ఎన్టీఆర్ నీల్ ల డ్రాగన్ సినిమా సినీ ప్రపంచం మొత్తాన్ని మొత్తాన్ని చుట్టేస్తుందని తెలిపారు. కాగా ఈ మూవీ 2026 జనవరిలో రిలీజ్ కానున్నట్లు ఇటీవల మేకర్స్ డేట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.