Homeసినిమా వార్తలుపవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమా పుకార్ల పై స్పందించిన నిర్మాత డివివి దానయ్య

పవన్ కళ్యాణ్ – సుజీత్ సినిమా పుకార్ల పై స్పందించిన నిర్మాత డివివి దానయ్య

- Advertisement -

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో పుకార్లు చాలా వేగంగా వ్యాపించడం మామూలే, అందులోనూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించిన వార్తలు అయితే మరింత విస్తృతంగా వ్యాపిస్తాయి. తాజాగా అలాంటి ఒక వార్తే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోందినిర్మాత డివివి దానయ్య, పవన్ కళ్యాణ్ హీరోగా, రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ సినిమా తెరకెక్కనుందని పుకారు ఇటీవల వ్యాపించింది.

సుజీత్ స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ కు చెప్పారని, అది పవన్ కు నచ్చిందని చాలా వెబ్ సైట్లు పలు రకాల కథనాలు రాశాయి. ఆర్‌ ఆర్‌ ఆర్‌ వంటి భారీ విజయాన్ని సాధించిన డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా తెలిపారు. ఈ పుకార్లు చాలా త్వరగా వ్యాపించడంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వాటిని నమ్మడం ప్రారంభించారు. మంచి స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమాలో తమ హీరోను చూడచ్చనే ఆనందంలో తేలియాడుతూ ఉన్నారు.

అయితే ఈ నిరాధారమైన పుకార్లను కొట్టిపారేయడానికి డీవీవీ దానయ్య ముందుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారం పై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ మేం నిర్మించే చిత్రానికి సంబంధించిన ఏదైనా సమాచారం మా నుండి నేరుగా వస్తుంది. దయచేసి బయటి ఊహాగానాలు నమ్మవద్దు అని తెలిపారు. అంటే దానయ్య గారి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా చేయడం ఖాయం కానీ దర్శకుడు ఎవరూ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం ఇప్పుడప్పుడే తెలిసేలా లేదు.

READ  లైగర్ ఫలితం తరువాత సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన ఛార్మీ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన ఏ కొత్త సినిమాను కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే హరి హర వీర మల్లు, హరీష్ శంకర్ యొక్క భవదీయుడు భగత్ సింగ్, అలాగే నిర్మాత రామ్ తాళ్లూరి మరియు దర్శకుడు సురేందర్ రెడ్డిలతో మరో సినిమాలతో ఆయన చాలా బిజీ షెడ్యుల్ ఉన్నారు.

అయితే సుజీత్, పవన్ కళ్యాణ్ సినిమా నిజంగా రూపుదాల్చితే.. సుజీత్ ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటార నేది ఇక్కడ ఆసక్తికరం. సాహో సినిమా భారీ పరాజయం పాలైన తర్వాత మార్కెట్ లో తిరిగి బలమైన పునరాగమనం చేయడానికి సుజీత్ కు ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌ ను హ్యాండిల్ చేయడంలో విఫలమైతే, సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి భారీ తరహాలో ఆగ్రహానికి మరియు ట్రోలింగ్ కు గురి అవుతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  థాంక్యూ చిత్రంతో దిల్ రాజుకు తీరని నష్టాలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories