దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు కావడంతో పాటు నైజాంలో నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇతర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించడంతో పోటీ తాలూకు వేడిని ఆయన చవిచూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిబంధనలను బట్టి ఒక్కో సినిమాకు దిల్ రాజు ఒక్కో లెక్కలు వేసుకోవడమే అంటున్నారు.
అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజు ఒక సినిమాను నిర్మిస్తే నైజాం కలెక్షన్స్ లో రికార్డ్ లెక్కలు చూపిస్తారట. ఎందుకంటే ఆ సినిమాకి ఎలాగూ ఆయనే డిస్ట్రిబ్యూటర్ కూడా అవుతారు. అదే పాలసీని తాను భారీ మొత్తానికి కొనుక్కున్న సినిమాకు కూడా ఫాలో అవుతూ ఉంటారట . అయితే అదే దిల్ రాజు ఫలానా సినిమా లాభాలను ఆ చిత్ర నిర్మాతతో పంచుకోవాల్సి వస్తే మాత్రం ఆ సినిమాకు కలెక్షన్ల లెక్కలు వేరుగా ఉంటాయట.
దిల్ రాజు లాభాలను నిర్మాతతో పంచుకోవాల్సి వస్తే కలెక్షన్లను తక్కువ సంఖ్యలో చూపిస్తారని అంటున్నారు. అలాగే ఆయన కమీషన్ ప్రాతిపదికన సినిమా విడుదల చేస్తే పరిస్థితి ఇంకా పూర్తిగా భిన్నంగా ఉంటుందని, అనేక కారణాలను చూపుతూ ఆ సినిమాకి చాలా తక్కువ అంకెలు చూపిస్తారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
దిల్ రాజు విభిన్న లెక్కల గురించి ఈ టాక్, డిస్కషన్ చాలా రోజులుగా డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ లో నడుస్తోంది. ఈ కారణంగానే దిల్ రాజు, దర్శకుడు కొరటాల శివ, మైత్రీ మూవీస్ బ్యానర్ తో పాటు మరికొందరు ఇండస్ట్రీ వర్గాల మధ్య కొన్ని సమస్యలు కూడా వచ్చాయని సమాచారం అందింది.