నాగ చైతన్య హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం “థ్యాంక్యూ”.ఇందులో మాళవిక నాయర్, అవికా గోర్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు.ఇది వరకు విడుదల చేసిన పాటలు, పోస్టర్లు, టీజర్ అన్నీ బాగుండటం వల్ల సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.విక్రమ్ కే కుమార్ అంటే ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది.మూడు దశల్లో హీరో జీవితం కనిపించే ఈ సినిమాలో హీరో నాగ చైతన్య ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు.
ఈ చిత్రాన్ని మొదట జూలై 8 న విడుదల చేస్తాం అని ప్రకటించిన చిత్ర బృందం ఇటీవలే ఆ విడుదల తేదీని 22కి మార్చడం జరిగింది.దానికి కారణాలు చెప్తూ నిర్మాత దిల్ రాజు ఏమన్నారు అంటే సినిమాకి సంభందించిన పబ్లిసిటీ పనులకి కాస్త సమయం కావాలని, ఇంకా మూడు సాంగ్స్ రిలీజ్ చేయాలనీ, ట్రైలర్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ అందుకే సినిమాను ఇంకో రెండు వారాలు లేటుగా తీసుకొద్దామని అనుకున్నట్టు తెలిపారు.
అయితే అసలు అది విషయం అది కాదని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ కాకపోగా,కనీసం నామమాత్రపు స్పందన కూడా రాలేదు. మరో పాట రిలీజ్ చేయాల్సి ఉంది,ఇలాంటి క్లాస్ కంటెంట్ సినిమాలకు పాటల వల్ల ఎంత క్రేజ్ అవసరమో దిల్ రాజుకి బాగా తెలుసు. అందుకని తరువాత రిలీజ్ చేస్ పాటలు, ప్రోమోలతో అయినా సినిమాకి రావాల్సిన బజ్ తీసుకురావాలి అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఒకవేళ అప్పటికీ సినిమాకి అనుకున్నంత స్థాయిలో క్రేజ్ రాకపోతే మరోసారి థాంక్యూ ను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.