తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైననిర్మాత దిల్ రాజు మళ్ళీ తండ్రయ్యారు. దిల్ రాజు భార్య తేజస్విని ఈరోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దిల్ రాజు ఇంట సంబరాలు జరుగుతున్నాయి. దిల్ రాజు తేజస్వినిలకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు దిల్ రాజు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలనూ నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
దిల్ రాజు , తేజస్వినిల వివాహం డిసెంబర్ 10, 2020లో నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో పరిమిత సంఖ్యలోని అతిథులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. దిల్‌రాజుకు ఇది రెండో వివాహం ఆయన మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో కాలం చేశారు. దిల్‌రాజు, అనితలకు ఓ కుమార్తె ఉంది. ఆమె హన్షిత. ప్రస్తుతం ఆమె దిల్ రాజు రూపొందిస్తోన్న కొన్ని సినిమాల నిర్మాణ పనులను వ్యవహరిస్తూనే తెలుగు డిజిటల్ మాధమ్యం ఆహాలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
ఇక దిల్‌రాజు ఇప్పుడు తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ హీరో దళపతి విజయ్‌తో వారసుడు (తమిళంలో వారిసు) అనే సినిమాను చేస్తోన్న సమయంలోనే ఆయనింటికి నిజమైన వారసుడు రావడం భలే యాదృచ్ఛికంగా చెప్పుకోవచ్చు. మరో వైపు చరణ్, శంకర్ కాంబినేషన్‌లో దిల్‌రాజు, శిరీష్ కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా దిల్ రాజు కు పుట్టిన బిడ్డకు అంతా మంచే జరగాలని పుత్రోత్సాహంతో దిల్ రాజు మరిన్ని విజయవంతమైన చిత్రాలను తీర్చిదిద్దాలని కోరుకుందాం.