ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక బిగ్ అప్ డేట్ వచ్చింది. నిర్మాత నాగవంశీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో SSMB28 షూటింగ్ కి సంభందించిన ప్లాన్స్, అలాగే రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. జనవరి 18న ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమై ఆగస్టు 11న సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని నాగ వంశీ తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో మహేష్ బాబు నటిస్తున్న SSMB28 ఒకటి. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై మహేష్ అభిమానులతో ఇతర సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇటీవల ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించట్లేదని, ఆమెను సినిమా నుండి తొలగించారని రగరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు నాగ వంశీ ఆమె సినిమాలో ఉందని ఖరారు చేయడంతో ఆ పుకార్లకు తెరపడినట్లే.
మహర్షి తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే రెండోసారి నటిస్తుండగా, మిగతా తారాగణం గురించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. కాగా ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా హారిక, హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక గతంలో కొన్ని మీడియా సంస్థలు చెప్పినట్లు ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదని నిర్మాత నాగవంశీ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమా అని ఆయన అన్నారు.