భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలు అయితే చేయటం లేదు. ఇటీవల అక్కడక్కడ హాలీవుడ్ సినిమాలు చేశారు ప్రియాంక.
ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుకుతున్న ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 లో ఆమె ఒక కీలక పాత్ర చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది.
అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా అనంతరం ప్రియాంక వరుసగా పలు భారతీయ సినిమా అవకాశాలు అందుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హృతిక్ హీరోగా రూపొందనున్న క్రిష్ 4 సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించనుండగా తాజాగా అనౌన్స్ అయిన అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ నటించే అవకాశం ఉంది.
అలానే ఆమె చేతిలో మరొక రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయట. ఆ విధంగా ప్రస్తుతం వరుసగా ఇండియన్ సినిమా అవకాశాలతో కొనసాగుతున్నారు ప్రియాంక చోప్రా. మరి ఈ సినిమాలు ఆమెకు ఎంత మేర విజయాలు అందిస్తాయో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాలి.