సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్రోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29. ఈ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ అందరిలో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్నాళ్లపాటు ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ జరిగింది.
నిజానికి ఇంకా అధికారిక అనౌన్స్మెంట్ కూడా రాని ఈ సినిమాపై అందరిలో ఎంతో ఆసక్తి ఉంది. ప్రియాంక చోప్రా ఒక కీలకపాత్రలో కనిపిస్తున్న ఈ మూవీలో మలయాళ నటుడు కం దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఇందులో నటిస్తున్న న్యూస్ వైరల్ అవుతుంది.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ వరల్డ్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ తదుపరి షెడ్యూల్ రేపటి నుంచి ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే మహేష్ బాబు మరియు రాజమౌళి బృందం అక్కడికి చేరుకోగా ప్రియాంక చోప్రా మరియు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ తాజా షెడ్యూల్లో జాయిన్ అవ్వనున్నారట.
ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా వరల్డ్ వైడ్ హై టెక్నికల్ వాల్యూస్ తో హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటులు కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుందని చెప్తున్నారు. అయితే మార్చి 30న ఉగాది సందర్భంగా కూడా ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాగా దీనిని 2027 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తోందట.