Homeసమీక్షలు'పెరుసు' మూవీ రివ్యూ : అసాధారణ అంశం చుట్టూ సాగే ఎంటర్టైనర్ 

‘పెరుసు’ మూవీ రివ్యూ : అసాధారణ అంశం చుట్టూ సాగే ఎంటర్టైనర్ 

- Advertisement -

తాజాగా తమిళ్ లో రిలీజ్ అయిన అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పెరుసు. ఈ వారం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాగానే వ్యూయర్ షిప్ అందుకుంటూ కొనసాగుతోంది. మరి ఈ మూవీ యొక్క కథ కథనాలు ఏమిటి, ఆర్టిస్ట్ ల యొక్క పెర్ఫార్మన్స్ లు ఇతర అంశాలు అన్ని కూడా ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం. 

చిత్రం: పెరుసు

రేటింగ్: 2.75/5

తారాగణం: వైభవ్, సునీల్ రెడ్డి, నిహారిక NM, చాందిని తమిళరసన్, బాల శరవణన్ మరియు ఇతరులు

దర్శకుడు: ఇళంగో రామ్

నిర్మాతలు: కార్తెకేన్ సంతానం, హర్మన్ బవేజా, హిరణ్య పెరీరా

స్ట్రీమింగ్ ఆన్: నెట్‌ఫ్లిక్స్

కథ : 

ఒక కమ్యూనిటీలో అందరి నుండి మంచి పేరు కలిగిన వృద్ధుడైన హాలశ్యాం అనుకొకుని కారణం వలన హఠాత్తుగా మృతి చెందుతాడు. ఐతే అతడి మరణానంతరం ఆ డెడ్ బాడీని మొదటగా చూసిన అతడి పెద్ద కొడుకు సామీ, ఆ బాడీ పై ఒక అనుకోని ఘటనని చూసి ఆశ్చర్యపోతాడు.

అనంతరం అతడి చిన్న కొడుకు, భార్య, కోడళ్ళు సహా ఇంట్లోని వారందరూ కూడా ఆ ఘటన ని చూసి విషయం గ్రహించి దానిని ఇతరులు ఎవరికీ కూడా తెలియకుండా అతడి బాడీని కప్పి ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి అంత సడన్ గా హాలశ్యాం ఎందుకు మరణించాడు, అతడి బాడీ లోని ఆ అసాధారణ ఘటన ఏంటి, అది అందరికీ తెలిసిందా, చివరికి ఏమైంది అనేది మొత్తం కూడా పెరుసు మూవీలో చూడాల్సిందే. 

నటీనటుల పెర్ఫార్మన్స్ : 

READ  'రాబిన్ హుడ్' రివ్యూ : కొన్ని సరదా నవ్వుల కోసం మాత్రమే 

ముఖ్యంగా ప్రధాన పాత్రలు చేసిన వైభవ్, సునీల్ రెడ్డి ఎంతో చక్కగా తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కీలకమైన సన్నివేశాల్లో వారు పండించిన ఎంటర్టైన్మెంట్ ఆకట్టుకుంటుంది. ఇక నిహారిక, చాందిని తమిళరసన్, బాల శరవణన్, మునిష్కాంత్ మరియు రెడిన్ కింగ్స్లీ అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ తో అలరించారు. 

విశ్లేషణ : 

కొన్ని ప్రాంతాల్లోని ఒక అసాధారణ ఘటనలని తీసుకుని తెరకెక్కిన అడల్ట్ కామెడీ పెరుసు చాలావరకు సక్సెస్ అయింది. మనకి సినిమా కొద్దిగా మొదలైన దగ్గరి నుండి ఆ అసాధారణ ఘటనని చూసి కొంత షాకింగ్ గా అనిపించినా దానిని ఎంటర్టైన్మెంట్ తో పాత్రల మధ్య ఆకట్టుకునే రీతిన దర్శకుడు ఇళంగో రామ్ బాగా ముందుకు నడిపారు.

అక్కడక్కడా కొంత సాగతీతగా అనిపించినప్పటికీ ఓవరాల్ గా అయితే చాలా సన్నివేశాలు హాస్యాస్పదంగా సాగుతాయి. అయితే ఇటువంటి అడల్ట్ కామెడీ మూవీస్ ని ఫామిలీ తో కలిసి చూడడం మాత్రం కుదరదు. 

ప్లస్ పాయింట్స్ :

  • అసాధారణ మరియు విచిత్రమైన కథాంశం
  • నటీనటుల యాక్టింగ్
  • కామెడీ

మైనస్ పాయింట్స్:

  • కొంత సీన్స్ అనంతరం పట్టు కోల్పోతుంది
  • కొన్ని చోట్ల మాత్రమే సాగిన అనుభూతి
READ  'ఎంపురాన్' మూవీ రివ్యూ : డిజప్పాయింట్ చేసే సీక్వెల్

తీర్పు : 

సునీల్ రెడ్డి, వైభవ్, నిహారిక, చాందిని తమిళరసన్ తదితరులు కీలక పాత్రలు చేసిన అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పెరుసు ఎంటర్టైన్మెంట్ తో సాగుతూ ఆకట్టుకుంటుంది. అయితే ఫామిలీ తో కలిసి కాకుండా విడిగా ఈ మూవీ చూస్తే ఎంజాయ్ చెయ్యవచ్చు. ఓవరాల్ గా ఆకట్టుకునే రీతిన దర్శకుడు ఈ మూవీని నడిపారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories