తొలి పాన్ ఇండియా స్టార్ గా అందరి చేతా మన్ననలు అందుకున్న ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.
స్క్రీన్ మీద వీరోచిత పోరాటాలు, బాహుబలి లాంటి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు, పాత్రలతో ఆకట్టుకునే ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ చిన్నా పెద్దా అందరి చేతా ముద్దుగా డార్లింగ్ అని పిలిపించుకుంటాడు. అందుకు కల్మషం లేని తన మనసు, ప్రవర్తనే కారణం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ భారీ సినిమా ప్రాజెక్ట్ కే చేస్తున్న సంగతి తెలిసిందే..అందులో హీరోయిన్ గా దీపికా పదుకునే, మరో ముఖ్య పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. ఇటీవల దీపికా స్వల్ప అనారోగ్యం పాలైన మాట వాస్తవం.
ఆ విషయం మీద పలు రకాల పుకార్లు వినిపించినా, చిత్ర బృందం అలాంటిదేమీ లేదని, దీపికా ఆరోగ్యం కుదుట పడింది అన్న విషయాన్ని ధృవీకరించారు. షూటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేందుకు దీపికా అందుబాటులో కూడా ఉన్నా, ప్రభాస్ నిర్మాతలను షూటింగ్ పోస్ట్ పోన్ చేయమని సూచించినట్టు తెలుస్తుంది.
నిజానికి ప్రభాస్, దీపికా ల మధ్య ముఖ్యమైన సన్నివేషాలు తీయాల్సి ఉండింది అట ఈ షెడ్యుల్ లో. అయితే దీపికా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆమె తనంతట తాను పూర్తిగా సిద్ధం అయ్యాకే మళ్ళీ షూటింగ్ చేయవచ్చు అని ప్రభాస్ చెప్పినట్టు తెలుస్తోంది.
హార్ట్ రేట్ లో హెచ్చు తగ్గుల వల్ల దీపికా ఇబ్బంది పడగా ఆమెను కామినేని హాస్పిటల్స్ లో జాయిన్ చేయగా, చికిత్స తరువాత దీపికా పరిస్తితి మెరుగు పడిందని సమాచారం. అయితే ఇక మీదట ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ తలెత్తకుండాసహానటి గురించి ఇంతగా అలోచించి నిర్ణయం తీసుకున్న ప్రభాస్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.