Homeసినిమా వార్తలుదిల్ రాజుదే తప్పు అంటున్న అశ్వినీదత్

దిల్ రాజుదే తప్పు అంటున్న అశ్వినీదత్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నిర్మాత మరియు వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ నిర్మించిన ‘సీతారామం’ చిత్రం ఆగష్టు 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో జంటగా నటించారు. సుమంత్, రష్మిక మందన కీలక పాత్రల్లో నటించారు. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు.

ఈ మేరకు నిర్మాత అశ్వినిదత్ పలు మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఆయన అనేక విషయాల గురించి మాట్లాడారు. సీతారామం చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది అని అన్నారు. అలాగే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న బంద్ లు, టికెట్ ధరల సమస్య, ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవడం వంటి అంశాలపై ఆయన వివరంగా అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ప్రభాస్ ప్రాజెక్ట్ కె గురించి కూడా అశ్విని దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కర్ణుడి చావుకి వేయి కారణాలు అన్నట్లు ప్రస్తుతం థియేటర్ల వద్దకు ప్రేక్షకులు రాకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అని అన్నారు. కరోనా, ఓటిటి, టికెట్ ధరలు పెంచడం, తగ్గించడం ఇలా అనేక కారణాలు ప్రేక్షకుల పై ప్రభావం చూపాయి అని అన్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక వర్గం అయితే వాళ్లే థియేటర్లు తీసుకుని, అందులో సమోసాలు కూడా వాళ్లే అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు అని అశ్వినీదత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

READ  జూలై 15న విడుదల కానున్న సాయి పల్లవి కొత్త సినిమా "గార్గి"

ఓ పక్క హీరోలు పారితోషికాలు పెంచడం, మరో పక్క నిర్మాణ వ్యయం పెరిగిపోవడం గురించి అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక టికెట్ ధరలు అనేవి బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కలిసి నిర్ణయించుకోవాలి. అలా కాకుండా నిర్మాతలు, హీరోలు ఆ విషయంలో జోక్యం చేసుకుని టికెట్ ధరలు పెంచడంతో.. అది కేవలం వారి స్వలాభం మరియు స్వార్థంతో చేసిన పని అని ప్రజలు భావించారు. వీళ్ళ రెమ్యునరేషన్స్ పెంచుకోవడం టికెట్ ధరలు పెంచుతున్నారు అని ప్రజలు అనుకున్నారు కాబట్టే.. ఆ ప్రభావం సినిమా ఫలితాల మీద పడటం మొదలైన తర్వాత మళ్ళీ టికెట్ ధరలు తగ్గిస్తున్నారు అని అన్నారు.

ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ కూడా ఒక నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్లు డబ్బు తగలేసేది వీళ్ళే.. ఆ తరువాత మళ్ళీ నిర్మాణ వ్యయం పెరిగింది అంటూ షూటింగులు బంద్ చేసేది కూడా వీళ్ళే అంటూ అశ్విని దత్ దిల్ రాజు తదితరులపై మండి పడ్డారు. టికెట్ రేట్లు ముందు పెంచి ఆ తరువాత మళ్ళీ తగ్గించి ఇలా టికెట్ రేట్లను ప్రచారం చేసి ప్రేక్షకులని అయోమయంకు గురి చేసింది దిల్ రాజు అని అశ్వినీదత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వారి ఇష్టం వచ్చినట్లు షూటింగ్ లను ఆపేయమంటే అందుకు ఒప్పుకునేది లేదని, గిల్డ్ సభ్యులు తప్ప ఎవరు.కూడా షూటింగ్ లను ఆపరు అని అశ్వినీదత్ అన్నారు.

READ  మళ్ళీ ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ హారి హర వీరమల్లు షూటింగ్

ఇక యంగ్ రె బల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆనందించే వార్త చెప్పారు అశ్వినిదత్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రాన్ని అమెరికా, చైనాతో పాటు అనేక దేశాల్లో పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. 2023 జనవరి కల్లా షూటింగ్ పూర్తవుతుంది. 8 నెలల పాటు గ్రాఫిక్స్ కు సంబంధించిన పనులు పూర్తి చేసి, కుదిరితే 2023 అక్టోబర్ 18న లేదా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని అశ్విని దత్ అన్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories