ప్రభాస్ పాన్ ఇండియా భారీ చిత్రం సలార్ ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారని గతంలో అనేక ఊహాగానాలు వచ్చాయి, దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా కొన్ని ప్లాన్స్ వేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల అవుతుందని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ సాలార్’ సినిమా పై అందరి దృష్టి ఉంది. హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ దీర్ఘకాలిక ప్రణాళికల గురించి ఆలోచించారని, రాబోయే రోజుల్లో సాలార్ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని సూచించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అంతే కాకుండా సాలార్ సీక్వెల్ కేజీఎఫ్ తో ముడిపడి ఉంటుందని.. మరో కొన్ని ఆసక్తికరమైన పాత్రలు కూడా ఈ వరుసలో వచ్చి చేరతాయని కూడా వార్తలు వచ్చాయి. ఆ రూమర్స్ విన్న ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అయ్యారు. అయితే పైన చెప్పినట్టు సాలార్ ను సింగిల్ పార్ట్ గా మాత్రమే తెరకెక్కించనున్నారట.
ప్రస్తుతానికి షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గురించి ఎలాంటి ప్లాన్స్ లేవు. అసలు సీక్వెల్ ఏదైనా ఉంటే అందుకు తగ్గ అధికారిక ప్రకటన దర్శకుడు ప్రశాంత్ నీల్ లేదా నిర్మాత విజయ్ కిరగందూర్ నుంచి వస్తేనే నమ్మగలం.
ప్రభాస్ కథానాయకుడిగా నారుస్తున్న ‘ సాలార్’లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘వరదరాజ మన్నార్’ పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో పాస్తు జగపతిబాబు, శ్రుతిహాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.