ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, తమిళ కమెడియన్ యోగి బాబు కీలక పాత్రలు చేస్తుండగా రాక్ స్టార్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ని రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు నేడు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, గతంలో మహానుభావుడు, ప్రతి రోజు పండగే తప్ప మారుతీ పెద్దగా విజయాలు అందుకోలేదు.
ఇటీవల గోపీచంద్ తో తీసిన పక్కా కమర్షియల్ కూడా ఘోరంగా ఫ్లాప్ అవడంతో తమ హీరోతో తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ ఏవిధంగా తీస్తున్నారో అనే భయం అయితే కొంత ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉంది. కాగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఈ మూవీ కోసం దర్శకడు మారుతీతో పాటు తమ టీమ్ అంతా కష్టపడుతున్నట్లు మేకర్స్ చెప్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.